త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతామని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీతో సమర్థంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాదే. మళ్లీ 1995 నాటి చంద్రబాబును చూస్తారు. త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తా. అంగన్వాడీలు, స్కూళ్లు, డ్రైనేజీలను పరిశీలిస్తా. నిర్లక్ష్యం వహిస్తే యాక్షన్ తీసుకుంటా’ అని అధికారులకు హెచ్చరించారు.