ఆరోగ్య శ్రీ అమలు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: షర్మిల (వీడియో)

AP: ఆరోగ్య శ్రీ పథకం ఆగిపోవడంపై PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. "ఆరోగ్య శ్రీ అమలు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. పేదవాడికి వైద్యం అందించే ఆరోగ్య శ్రీని చంద్రబాబు స్ట్రెక్చర్ పైకి ఎక్కించారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్య శ్రీని మొత్తానికే మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. 14 రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలు ఆపేసినా చంద్రబాబులో చలనం లేదు. వెంటనే ఈ స్కీమ్‌ని అమలు చేయాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్