సజ్జలను పక్కన పెట్టనున్న మాజీ సీఎం జగన్?

AP: YCPలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో విభేదాలు తలెత్తడంతో, జగన్ చుట్టూ ఉండే కోటరీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనాన్ని ఇతర సీనియర్లు సహించుకోలేకపోతున్నారని, ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ పునరాలోచనలో పడ్డారని, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు రాష్ట్ర సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అదే జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇతర విభాగాల బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మార్పు వైసీపీలో సంచలనం సృష్టించనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕