ఏ క్షణమైనా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్?

AP: కల్తీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌పై చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు జనార్దన్ రావు వాట్సాప్ చాట్ లీక్ కావడంతో, జోగి రమేష్‌కు ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, టీడీపీ ఎమ్మెల్యేలు వసంత, బోడె ప్రసాద్‌లు జోగి రమేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ డైరెక్షన్‌లోనే కల్తీ మద్యం వ్యాపారం జరిగిందని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్