మద్యం కేసులో జగన్ అరెస్ట్ అవుతారా? అని మీడియా ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ‘ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీకి డబ్బులు వెళ్లలేదా? ఈ విషయంపై ఆయన సమాధానం చెప్పగలరా? HYD ఫాంహౌస్‌లో దొరికిన డబ్బులు నావి కాదని రాజ్ కెసిరెడ్డి చెప్పాడంటే.. జగన్‌వేనని అర్థం చేసుకోవాలి’ అని లోకేశ్ అన్నారు.