వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు షాక్ ఇవ్వనున్న జగన్?

AP: పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు త్వరలో షాక్ తగలవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదని, సొంత వ్యాపారాలకే పరిమితం అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ అధినేత జగన్ పలుమార్లు హెచ్చరించినా అదీప్ రాజు యాక్టివ్‌గా ఉండటం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం. దీంతో చురుగ్గా ఉండే నేతలకు పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. అదీప్ రాజును పక్కన పెట్టి, పెందుర్తిలో బలమైన నేత కోసం అన్వేషణ ప్రారంభించిందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్