AP: ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ అధినేత జగన్ విమర్శించడం బాధాకరమని అన్నారు. కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఐదు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి 392 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. "పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ ఎందుకు ఓర్వలేకపోతున్నారు?" అని లోకేశ్ ప్రశ్నించారు.