AP: వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేయడానికి కృషి చేస్తానని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నాకు బైపాస్ సర్జరీ జరిగింది. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నాను. మరో 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమాల్లోకి వస్తా’ అని కొడాలి నాని అన్నారు.