AP: కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాబోయే ఎన్నికల్లో యువతనే సీఎం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఏపీలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికే ఉద్దేశంతోనే ఈ పార్టీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 'సీఎం కొడుకే సీఎం కావాలా?.. ఏపీని చంద్రబాబు, జగన్ కుటుంబికులే శాసించాలా?.. ఆ రెండు కుటుంబాల నుంచే నాయకులు రావాలా? ప్రజల నుంచి నాయకులు కావొద్దా?.. అందుకే PRP పార్టీ పెట్టా. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి, యువకులనే సీఎం చేస్తా' అని స్పష్టం చేశారు.