ఢిల్లీలో రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే ఆదినారాయణ

AP: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరుగుతున్నాయని, తాను సంతృప్తి చెందకపోతే ఢిల్లీలో రాజీనామా చేస్తానని అన్నారు. తన తమ్ముడి కుమారులిద్దరి జెడ్పీటీసీ రాజీనామాలు కొనసాగుతాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో చర్చలు జరిగినా తమకు సమంజసమైన సమాధానం రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీకి సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందన్నారు. జరిగిన అన్యాయాలపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చిస్తానని అన్నారు. ఢిల్లీ పెద్దల నుంచి సరైన హామీ రాకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Credits: RTV

సంబంధిత పోస్ట్

✕
✕