కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మ‌రికొందరు?

AP: మాజీ మంత్రి శైలజానాథ్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. జగన్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని శైలజానాథ్ చెప్పారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వైసీపీలోకి వస్తారని చెప్పుకొచ్చారు. తనకు జగన్ ఏ బాధ్యత అప్పగించినా తన శక్తి మేరకు పనిచేస్తానని స్పష్టం చేసారు. అయితే కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒక‌రు త్వ‌ర‌లోనే వైసీపీ గూటికి చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, శైలజానాథ్‌కు పార్టీలో కీలక పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్