AP: అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నేతలు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ సాగుతోంది. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీ ఒకరు, వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా? అనే భయం, మళ్లీ విపక్షంలో కూర్చునే పరిస్థితి వస్తుందేమోనని వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు బెంగ పెట్టుకున్నారని సమాచారం. వాటి నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో టచ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.