పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పేరు, గుర్తుపై ఈసీ తీసుకున్న మధ్యంతర నిర్ణయం నేపథ్యంలో ఏపీలో వైసీపీపై రాజకీయ చర్చ మొదలైంది. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో, పదో షెడ్యూల్లోని మూడింట రెండొంతుల నిబంధనపై విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఎమ్మెల్యేల సంఖ్యాబలంతోనే పార్టీపై హక్కు ఆటోమేటిక్గా మారదు. చట్టపరమైన ప్రక్రియ, స్పీకర్, ఎన్నికల సంఘం నిర్ణయాలు కీలకం. కాగా, వైసీపీలో అంతర్గత అసంతృప్తి, నేతల భవిష్యత్ వ్యూహాలపై చర్చలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైపు కొందరి నేతలు మొగ్గు చూపడంతో వైసీపీలో సంక్షోభం తప్పదనే చర్చ సాగుతోంది.