AP: అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజాగా సంచలన ట్వీట్ చేశారు. పరీక్షల వ్యవస్థపై నమ్మకం పోతే అభ్యర్థుల కలలు చెదిరిపోతాయని, వారి ఆశలన్నీ అడియాశలే అవుతాయని పేర్కొన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వంపై ఆయన ప్రతి రోజూ ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులు పడిన కష్టానికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమకు లేదా సీఎం చంద్రబాబుని అని ప్రశ్నించారు. డీఎస్సీలో ఇప్పుడు బయటపడుతున్న కుంభకోణానికి మీరు బాధ్యత వహిస్తారా? అంటూ వ్యాఖ్యానించారు.