AP: 2027 సెప్టెంబరు లేదా అక్టోబరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాజకీయ విశ్లేషణలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో ఆయన పాదయాత్రకు ముందే లేదా పాదయాత్ర సమయంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ఊహాగానాలు, రాజకీయ ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వివిధ కేసుల్లో అరెస్ట్ కావడంతో, జగన్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.