AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతింది. పాడేరు మండలంలోని ఇరడాపల్లి–రాయిగెడ్డ మధ్య నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డు ప్రారంభించిన కొద్దిరోజులకే వర్షాల ధాటికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నూతనంగా నిర్మించిన రహదారి ఒక్క వర్షానికే దెబ్బతినడంపై స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల నాణ్యత, ఇంజినీర్ల పర్యవేక్షణపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.