AP: ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర ఐ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్య పరిజ్ఞానం ఉన్నా, రోగి ఇంటి వద్దకే వైద్యం అందించేలా 'సంజీవని ప్రాజెక్టు' పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని, భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని తెలిపారు.