AP: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. తన మనవడి వైద్యం కోసం.. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తును ఎమ్మెల్యే తిరస్కరించారని భారతి అనే మహిళ నిలదీయడంతో వివాదం మొదలైంది. ‘నన్ను చంపిస్తావా?’ అని ఆమె ప్రశ్నించగా.. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.