AP: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ, జనసేన నేత జయప్రకాశ్ నాయుడుపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తనను ఆర్థికంగా, శారీరకంగా మోసం చేశారని బాధితురాలు మీడియా ముందుకు వచ్చి వాపోయింది. నమ్మించి అన్ని విధాలుగా ఉపయోగించుకుని, ఇప్పుడు వదిలేశాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. ప్రస్తుతం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, ప్రాణహాని ఉందని విలపించింది. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై రాజకీయంగా చర్చ మొదలవగా, పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.