AP: విశాఖపట్నంలోని అచ్చియ్యపేటలో బొడ్డు సుగుణ (34) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అప్పు తీసుకున్న ఇంట్లోనే ఆమె శవమై కనిపించారు. అయితే మరణించే ముందు సుగుణ తన భర్త అప్పన్నకు వాయిస్ మెసేజ్ పంపారు. ‘నా చావుకు ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ కారణం. అప్పులు తీర్చమని ధనలక్ష్మి టార్చర్ పెడుతోంది. ఈ టార్చర్ నాతోనే పోవాలి. నా వల్ల మీరు బాధపడకూడదు.’ అని సుగుణ చెప్పుకొచ్చారు. దాంతో కుటుంబీకులు ఆందోళనకు దిగారు.