AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఒక మహిళా ఓటర్ టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీకి ఓటేసినా కూడా మమ్మల్ని వేధిస్తున్నారని ఆమె మండిపడింది. "ఆడపిల్ల అని కూడా చూడకుండా, గత ఐదు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు" అని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.