AP: గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి వెళ్లగా.. మహిళలు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఫ్రీగా ఇళ్లు ఇస్తామని, టిడ్కో ఇళ్ల లోన్లు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని, ఏడాదైనా ఎలాంటి హామీ నెరవేర్చలేదని మహిళలు నిలదీశారు. హామీలు నెరవేర్చడానికి సమయం పడుతుందని ఎమ్మెల్యే చెప్పినా వినలేదు. దాంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు.