AP: వరల్డ్ కప్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ను మహిళా క్రికెటర్ స్మృతి మంధాన విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన లోకేశ్.. స్టాండ్స్‌కు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టే ప్రతిపాదన చేయగా.. ఏసీఏ ఆమోదించింది. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఒక స్టాండ్‌కు మిథాని రాజ్, ఇంకో గేటుకు రావి కల్పన పేరు పెట్టారు. వరల్డ్ కప్ గెలిచాక మహిళా క్రికెటర్లు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ అన్నారు.