AP: విజయవాడలో సచివాలయ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 30 మంది మహిళా సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని, లోపల నుంచి తాళం వేసినట్లు సమాచారం. నిరసనలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. మహిళా ఉద్యోగులను సైతం పోలీస్ స్టేషన్కు తరలించి ఉంచడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.