AP: చంద్రబాబు రెండేళ్ల పాలనలో మహిళలే మోసపోయారని వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారని, నాయకుల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ ఘటనలను ప్రస్తావిస్తూ, న్యాయం కోరిన బాధితురాలిపైనే దాడి జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు.