AP: జానపాడు-పిడుగురాళ్ల రైల్వే బ్రిడ్జిను వైసీపీ హయాంలోనే రూ.50 కోట్లతో శాంక్షన్ చేపించామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. టెండర్లు పిలిచి పనులకు శంకుస్థాపన చేసి రోడ్డు విస్తరణ పనులు కూడా చేయడం జరిగిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఇప్పటికి కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులతో రివ్యూ చేసుకుని, పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.