AP: అమరావతి క్వాంటమ్ వ్యాలీపై సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు ఐటీ, వాణిజ్య, ఫార్మా, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు విజయవాడకు చేరుకున్నారు. కాగా, నిన్న రాత్రి వీరికి సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడంపై చర్చించారు.