AP: CM చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం అమరావతిలో సమావేశమైంది. ఈ సందర్భంగా, అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. అమరావతి రాష్ట్రానికి వృద్ధి ఇంజిన్‌గా మారుతుందని వారు ప్రశంసించారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా అభివృద్ధి చేసి, అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.