ఆపరేషన్ ‘సిందూర్’ విజయవంతం కావాలని పూజలు చేయండి : పవన్

AP: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. సైనికులకు దైవబలం కోసం ప్రార్థించే సమయమిదేనన్నారు. జనసేన ఆధ్వర్యాన దేశంలోని తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో మంగళవారం పూజలు చేయించాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రతి క్షేత్రానికి ఒక ఎమ్మెల్యే, జన సైనికులను పంపించి పూజలు చేయించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్