ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. APERC సూచనలు సీఎం చంద్రబాబు హామీలకు పూర్తిగా విరుద్ధమని ఆమె విమర్శించారు. ఇప్పటికే రూ.15 వేల కోట్ల ట్రూ-అప్ బిల్లులతో ప్రజలకు భారం మోపి, ఇప్పుడు మరో రూ.15,651 కోట్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నమ్మి ఓటేసిన ప్రజలకు ఏడాదికో షాక్ ఇస్తున్నారని మండిపడ్డ ఆమె, విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని ప్రభుత్వం భరించాలని, గత సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.