నేడు రాజమండ్రిలో వైసీపీ బీసీ సభ

AP: రాజమండ్రి నగరంలో ఆదివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బీసీ ఆత్మీయ సభ జరగనుంది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ శ్రేణులను సన్నాహం చేయడం, బీసీ వర్గాల సంక్షేమానికి సంబంధించి చర్చించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕