TDP కార్యకర్తల వాహనంపై YCP శ్రేణుల దాడి

AP: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల పంచాయతీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. TDP కార్యకర్తల వాహనంపై YCP శ్రేణులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు TDP కార్యకర్తలు గాయపడగా, వారి కారు ధ్వంసమైంది. ఈ దాడికి సంబంధించిన ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్

✕
✕