22 ఏళ్లకే కౌన్సిలర్‌గా వైసీపీ అభ్యర్థి గెలుపు

AP: అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణంలోని 8వ వార్డులో 22 ఏళ్ల సాయిచరణ్‌ తేజ కౌన్సిలర్‌గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు కురుబ మహదేవ కుమారుడైన సాయిచరణ్‌, సివిల్స్‌ కోసం సిద్ధమవుతూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులపై 261 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన సాయిచరణ్‌, ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕