AP: ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించిన వైసీపీ, ప్రస్తుతం సరైన జెడ్పీ చైర్మన్ అభ్యర్థి దొరక్క ఉనికి కోసం ఇబ్బందులు పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. 35 స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతుండగా, వ్యూహాత్మక లోపం, నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి ఏర్పడిందని సమాచారం. బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రేసు నుంచి తప్పుకోవడంతో, ఆర్థిక భారం, పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ ముందుకు రావడం లేదని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.