AP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు YCP పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు. బలమైన, ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను త్వరగా గుర్తించాలని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కీలకమని, ఇది సాధారణ ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, వైఎస్సార్సీపీ హయాంలో చేసిన మంచి పనులను, సంక్షేమాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుత ప్రభుత్వ అన్యాయాలను వివరించాలని సూచించారు.