AP: YCP ప్రస్తుతం చంద్రబాబు కంటే లోకేష్‌పై దృష్టి సారించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైంది. ప్రజలు జగన్ పాలనతో విసిగిపోయారని, తండ్రి చాటు బిడ్డగా, భాష, రాజకీయాలు తెలియని లోకేష్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును కాకుండా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకోవాలని YCP నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.