AP: రాజధాని అమరావతిపై వైసీపీ కక్షగట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. రాజధానిలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక రైతులపైకి దండయాత్రకు దిగారన్నారు. రాజధాని నగరంగా అమరావతి రూపుదిద్దుకోవడం వైసీపీకి ఇష్టం లేదని, రెచ్చగొట్టే ధోరణిలో పర్యటించారని మండిపడ్డారు. అమరావతిపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు.