వైసీపీ ఈజ్ బ్యాక్.. జగన్‌ ప్లాన్ పనిచేస్తోందా?

AP: 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం తర్వాత వైసీపీ మళ్లీ క్షేత్రస్థాయిలో చురుకుగా మారుతోందనే చర్చ సాగుతోంది. పార్టీ అధినేత జగన్ వరుస కార్యక్రమాలు, నిరసనల ద్వారా క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ వంటి కార్యక్రమాలతో కార్యకర్తలను మళ్లీ యాక్టివ్ చేయడంలో కొంత మేర సఫలమయ్యారనే విశ్లేషణలు ఉన్నాయి. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు, సోషల్ మీడియాలో ప్రచారంతో పార్టీ ఉనికిని చాటుకుంటోంది. అయితే క్యాడర్ చైతన్యం మాత్రమే కాకుండా ప్రజల మద్దతును ఓట్లుగా మార్చుకోవడమే జగన్‌కు అసలైన సవాలు. మరి వచ్చే ఎన్నికల్లో కూటమిని గద్దె దించాలనే జగన్ ప్లాన్ పనిచేస్తుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్