క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ ప్రచారం: పయ్యావుల

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో వైసీపీ వాళ్లకి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రూ.240 కోట్ల స్కాం జరిగిందని సిట్ క్లియర్‌గా చెప్పిందని, భక్తి శ్రద్దలతో చేయాల్సిన లడ్డూ తయారీని డబ్బు కోసం కల్తీ చేశారన్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు జంతు అవశేషాలు ఉన్నాయని సిట్ కూడా చెప్పిందని, వైసీపీ హయాంలో టీటీడీ నిబంధనల మార్పుతోనే దుర్మార్గపు పనులకు పునాది పడిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్