AP: నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు, అమరావతిపై వైసీపీ విషం కక్కుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిందని, మూడు రాజధానుల పేరుతో జగన్ రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై అసభ్య పోస్టులు పెడుతూ, రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.