ప్రజలను బెదిరించడమే వైసీపీకి తెలుసు: నాదెండ్ల

TG: మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు ప్రజలను బెదిరించడమే తెలుసునని తెలిపారు. వైసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ గతంలో కారుతో మనిషిని తొక్కించాడని, బుధవారం ట్రాక్టర్లతో మామిడికాయలు తొక్కించాడని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కానీ వైసీపీ నాయకులు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్