పీలేరులో వైసీపీ నేతల అర్ధనగ్న నిరసన (వీడియో)

AP: అన్నమయ్య జిల్లా పీలేరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కూడా టీడీపీ అడ్డుకుందని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. ఆగ్రహంతో చొక్కాలు విప్పి నిరసన చేపట్టారు. నామినేషన్ పత్రాలను చించేసి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి జోక్యం చేసుకుని, నామినేషన్ల దాఖలుకు పోలీసుల సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన ముగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕