వైసీపీ నాయకులు బరితెగించారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ‘ప్లకార్డులు పట్టుకుని రప్పా రప్పా అంటూ న్యూసెన్స్ చేస్తుంటే, వారిని అదుపు చేయాల్సిన నాయకుడే వెనకేసుకొస్తున్నాడు. వైసీపీ హయాంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కొట్టేసిన వ్యక్తి పేర్ని నాని. అలాంటిది రప్పా రప్పా కాదు కన్ను గీటి మనుషులను చంపేస్తామంటూ బెదిరించడం దౌర్భగ్యం. పేర్ని నాని కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకొని చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.