ఎన్టీఆర్ జిల్లా నందిగామలో YCP శ్రేణుల అత్యుత్సాహం కనుమొన్నది. YCP నేతల ర్యాలీలో దున్నపోతు కట్టలు తెంచుకుని జనంలోకి దూసుకుపోయింది. ఈ క్రమంలో దున్నపోతు బెదిరించి, పొడవడంతో పలువురు YCP కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ర్యాలీలో తీవ్ర కలకలం రేగింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానికంగా చర్చనీయాంశమైంది.