SIRలో ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల అధికారికి వైసీపీ లేఖ

AP: ఓటర్ల జాబితా తయారీలో జరుగుతున్న అవకతవకలపై వైసీపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే.. ఇచ్చినట్లు తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని ఆరోపించింది. జూలై 1 నాటికి కేవలం 30.90% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తవగా, కడప, అనంతపురం అర్బన్, విజయవాడ వెస్ట్ వంటి పలు నియోజకవర్గాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్