వైసీపీ లంచ్ మోషన్.. విచారణకు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ అభ్యర్థులపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడుతూ, నామినేషన్ పత్రాలను లాక్కొని చించేస్తున్నారని, అక్రమంగా అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕