GVMC కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే రసాభాస

AP: విశాఖపట్నంలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. టీడీపీ ఎంపీ శ్రీభరత్ (లోకేష్ తోడల్లుడు)కు చెందిన గీతం విద్యాసంస్థల భూ దోపిడీని అడ్డుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఎంపీగా ఉండి భూ ఆక్రమణకు పాల్పడటం ఏంటని వారు ప్రశ్నించారు. మేయర్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో మీడియాను అనుమతించాలని కూడా వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్