AP: చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్థానిక ఎన్నికల్లో రక్తంతో అభిషేకం చేద్దామని, చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండే అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భరత్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.