వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు

AP: వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అప్పిరెడ్డిని గుంటూరులో పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు మంగళగిరి తీసుకొస్తున్నారు. మరికొందరు వైసీపీ కీలక నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. ఇక‌పోతే ఈ కేసులో ఇప్ప‌టికే అరెస్ట్ అయిన మాజీ ఎంపీ సురేష్‌కు కోర్టు 14 రోజుల‌పాటు రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్