వైసీపీ ఒంగోలు ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నం (VIDEO)

AP: ప్రకాశం జిల్లాలో వైసీపీ ఒంగోలు ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ నెల 8న నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో నివాళుల సందర్భంగా తన కాళ్లు తొక్కారని ప్రశ్నించడంతో కొందరు వైసీపీ నాయకులు తనపై దాడి చేశారని ప్రసన్న ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్